హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.మీర్ పేట్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 20 ఏళ్ల దుగ్యాల ఐశ్వర్య, బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో బిజినెస్ ఎక్సిక్యూటివ్ గా పనిచేస్తోంది. కొంతకాలం క్రితం మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో ఇన్ స్ట్రా గ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నా అని నమ్మించిన ఆశిర్ గతేడా ఫిబ్రవరి 20న ఐశ్వర్యను సంఘీ టెంపుల్ కు తీసుకివెళ్లి మెడలో తాళి కట్టాడు. పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అవారాగా తిరిగే ఆశిర్ రెడ్డి నిన్ను పోషించలేడంటూ ఐశ్వర్య ను ఇంటికి తెసుకువెళ్లారు. అప్పటినుంచి తల్లిదండ్రుల మీద కోపంతో హాస్టళ్లలో ఉంటోంది ఐశ్వర్య.

అయితే తాను, తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తానని నమ్మబలికిన ఆశిర్ ఆమెతో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడు. దీంతో ఐశ్వర్య ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ క్రమంలో వెళ్లి విషయం తేల్చాలి అని ఆమె ఒత్తిడి చేయడం ప్రారంభించింది. తనకు కొంత సమయం కావాలంటూ కాలయాపన చేస్తుండడంతో పాటు, ఆమెకు ఆబార్షన్ చేయించాడు. ఇటీవల పెళ్లి విషయం ఆడిగేందుకు ఆశిర్ ఇంటికి వెళ్లిన ఐశ్వర్యను అవమానించారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గత 20 రోజులుగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్ లో ఉంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఐశ్వర్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఫోన్ లో సూసైడ్ చేసుకునే ముందు కొన్ని సెల్ఫీ వీడియోలను తీసుకుంది. తమ కూతురి ఆత్మహత్యకు ఆశిర్ కారణమని ఐశ్వర్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.