పద్నాలుగు సంవత్సరాల వయసున్న మేనల్లుడిని లొంగదీసుకున్న మేనత్త ఆ బాలుడితో శారీరక వాంఛలు తీర్చుకుంటూ ఆ దృశ్యాలను వీడియో రికార్డింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ 20 తులాల బంగారు నగలతోపాటు రూ. 6 లక్షలను బలవంతంగా వసూలు చేసిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 10లోని గాయత్రీహిల్స్‌లో నివసించే ఓ మహిళ ఇంట్లో ఇటీవల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. అలమారాలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో ఆమె గాలిస్తున్న సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు(14) తాను మేనత్తకు ఒక నెక్లెస్‌ ఇచ్చానని చెప్పాడు. ఎందుకు ఇచ్చావంటూ తల్లి ప్రశ్నించగా బెంగళూరులో నివసించే మేనత్త తన బాయ్‌ఫ్రెండ్‌ ఇర్ఫాన్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చి చార్మినార్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఉండేదని చెప్పాడు.

తాను చదువుతున్న స్కూల్‌కు వచ్చి తనతో పాటు తీసుకెళ్లి లాడ్జిలో తన వాంఛలు తీర్చుకునేదని ఈ క్రమంలో ఆమె మాజీ భర్త ఇర్ఫాన్‌ ఈ దృశ్యాలను వీడియో తీసేవాడని ఎవరికైనా ఈ విషయం తెలియజేస్తే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించేవాడని ఇలా మూడుసార్లు తనను లాడ్జికి తీసుకెళ్లిందన్నారు. బంగారు ఆభరణాలతో పాటు రూ. 6 లక్షలు తీసుకురాకపోతే వీడియో బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడంతో దొంగిలించినట్లు బాలుడు తల్లికి చెప్పాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితురాలితో పాటు ఆమె మాజీ భర్తపై ఐపీసీ సెక్షన్‌ 384, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.