సద్దుల బతుకమ్మ మరియు దసరా సందర్భంగా వరంగల్ సిటి లో ట్రాఫిక్ ఆంక్షలు

తేదీ 06.10.2019 & 08.10.2019 రోజులలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.

 1. ములుగు భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనాలు సైలాని బాబా దర్గా వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 2. ఖమ్మం వైపు నుండి వచ్చు భారీ వాహనాలు నాయిడు పంప్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 3. నర్సంపేట వైపు నుండి వచ్చు భారీ వాహనాలు గొర్రెకుంట క్రాస్ రోడ్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 4. హైదరాబాద్ వైపు నుండి వచ్చు భారీ వాహనాలు రాంపుర్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.
 5. కరీంనగర్ వైపు నుండి వచ్చు భారీ వాహనాలు బావుపేట క్రాస్ రోడ్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పండగ అయిపోయేంతవరకు ఆపుకోవాలి.

అలాగే వాహనాల రద్దీ మరియు ప్రజల భద్రతను ధృష్టిలో ఉంచుకొని క్రింద నిర్దేశించిన మార్గాలలో వాహనాల రాకపోకలను నియంత్రించబడినవి.

 1. వరంగల్ రంగలీల మైదాన్ కు వెళ్ళు అన్నీ దారులు.
 2. ఫోర్ట్ రోడ్ జంక్షన్ నుండి చింతల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వరకు
 3. భద్రకాళి గుడి నుండి MGM హాస్పిటల్ జంక్షన్ వరకు.
 4. MGM జంక్షన్ నుండి పోతన రోడ్ వరకు.
 5. జెమిని సెంటర్ నుండి పాపయ్యపేట చమన్ వరకు.
 6. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీసు నుండి వరంగల్ చౌరస్తా వరకు.
 7. చిన్న వడ్డేపల్లి చెరువు దేశాయిపేట నుండి 80 ఫీట్ రోడ్ వరకు.
 8. గుండు బావి, కొత్తవాడ వరంగల్ ఏరియా.
 9. పద్మక్షమ్మ గుడి నుండి హనంకొండ చౌరస్తా వరకు.
 10. వేయి స్తంభాల గుడి రోడ్.
 11. వడ్డేపల్లి టాంక్ బండ్ నుండి ఫాతిమా జంక్షన్ వరకు.
 12. బందం చెరువు కాజీపేట రోడ్.

కావున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి పండగలు ప్రశాంతంగా జరుగుటకు పోలీసు వారికి సహకరించగలరని కోరుతున్నాము. కమీషనర్ అఫ్ పోలీస్, వరంగల్…