కావ్య కల్యాణ్‌ రామ్‌ ‘గంగోత్రి’ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి ఆ తర్వాత చిరంజీవి ఠాగూర్‌, బాలకృష్ణ విజయేంద్రవర్మ, నాగార్జున స్నేహమంటే ఇదేరా, పవన్‌ కల్యాణ్‌ బాలు తదితర సినిమాలతో అలరించింది. ‘గంగోత్రి’ సినిమాలోని ‘వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట’ సాంగ్ బాల నటిగా ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చింది. అలా దాదాపుగా 16 చిత్రాల్లో బాలనటిగా తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్​గా రాణిస్తోంది. కొన్ని రోజుల క్రితం ‘మసూద’ సినిమాతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. నిజానికి ఈ మూవీలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు.

కానీ ఆమె అందంతో పాటు వాయిస్ యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. వాళ్లంతా ఫిదా అయిపోయారు. దీంతో చిత్రసీమలోని చాలా మంది చూపు ఈ అమ్మడిపైనే పడుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ‘బలగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్​ టాక్​ తెచ్చుకుని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇందులో కూడా ఆమె నటన బాగుందని అంటున్నారు.