వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానంలో శాకాంబరీ నవరాత్రులు గురువారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసిన తర్వాత అమ్మవారి షడ్బేరములలో (ఆరుమూర్తులు) ఇచ్ఛాశక్తిని, కాళీ క్రమాన్ని అనుసరించి ఉదయం బలాకమాతగాను, జ్ఞానశక్తిని షోడశ్రీ క్రమానుసారం సాయం త్రం విజయమాతగాను అలంకరించి పూజలు చేశారు. జూలై 5వ తేదీన ఆదివారం గరుపౌర్ణమి రోజు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు.