మహిళ స్నానం చేస్తుంటే విచక్షణ మరిచిన ఓ యువకుడు తన సెల్ ఫోన్ కెమెరాతో రికార్డు చేస్తూ దొరికిపోయిన ఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తుర్కయాంజల్ పరిధిలోని మునగనూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు తమ పక్క ఇంట్లో నివసిస్తున్న ఓ మహిళను గత కొంత కాలంగా వెంబడిస్తున్నాడు.

అంతేకాదు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా, పలుమార్లు ఆమె హెచ్చరించింది. ఈ క్రమంలో ఆమె ఒక రోజు స్నానం చేస్తుండగా, ఆ యువకుడు నెమ్మదిగా బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్ ఫోన్ కెమెరాతో వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే చుట్టుపక్కల వాళ్లు గమనించి అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంరతం బాధితురాలి కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వాళ్లు నిందితుడిని బంధించి చితకబాది పోలీసులకు అప్పగించారు.

నిందితుడు బీటెక్ విద్యార్థి అని తేలగా, పోలీసులు కసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.