ఇద్దరు సందడి చేయబోతున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలో ఓ కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల మాదిరిగానే మూడో చిత్రం కూడా ఫ్యామిలీ యాక్షన్‌ నేపథ్యంలో రానుంది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ను ఎంపిక చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు.

తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రోజా నటించనున్నారని టాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అంతేకాకుండా ఆమె ఈ సినిమాలో ప్రతినాయకురాలిగా కనిపించనున్నారని తెలుస్తోంది. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే బాలకృష్ణ, రోజా కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. మరోసారి ఈ ఇద్దరు సందడి చేయబోతున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. బోయపాటి సినిమాలో బాలయ్య ఎవరితో పోటీ పడనున్నారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.