అభ్యుదయ సేవా సమితి, గర్ల్స్ అడ్వొకేసీ అలయన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు బాలసముద్రంలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో బాలల అక్రమ రవాణాను అరికట్టాలి అనే పోస్టర్ను వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పత్తి గారు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ: వరంగల్ మహానగర పరిధిలో పేదలు బాలబాలికలను, బాలకార్మికులుగా మార్చకుండా వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ లో ప్రవేశం కల్పించాలన్నారు. పేదరికాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని శక్తులు బాలికల అక్రమ రవాణ చేయుటకు ప్రయత్నించే సందర్భంలో వెంటనే పోలీసులకు,1098 కు సమాచారం ఇవ్వాలని అన్నారు. పొదుపు సంఘాలు, మహిళలు, బాలికలకు విద్య కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీర్ విద్యార్థి మండల భరద్వాజ్ పాల్గొన్నారు.