భువనేశ్వర్: పోలీస్ ఇన్‌స్పెక్టర్ 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లాలోని బిరమిత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలుకు డిజిపి క్షమాపణ తెలిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: కొన్ని రోజుల క్రిత ఇంటికి వెళ్లటానికి ఆటో కోసం 13 ఏళ్ల బాలిక ఎదురుచూస్తుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీస్ వాళ్లు పెట్రోలింగ్ చేస్తున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ మఝీ బాలికను స్టేషన్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పిలిచినప్పుడల్లా పోలీస్ స్టేషన్‌కు రావాలని బాలికను బెదిరించి ఇంటికి పంపించాడు. అలా పలుమార్లు బాలికపై పోలీస్ అధికారి అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె తండ్రి ఇద్దరు యువకులతో కలిసి డిజిపి అజయ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారిని ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాకుండా అతడితో మరో ఐదుగురుపై కేసు నమోదు చేశామని డిజిపి పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చ అని, సిగ్గుపడుతున్నామని, బాధితురాలును క్షమాపణ కోరుతున్నామని డిజిపి తెలిపాడు.