ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా బయటి నుంచి వచ్చేవారు బాలీవుడ్‌లో ఎదుర్కొనే పరిస్థితుల గురించి నటి శ్రద్ధాదాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించింది. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేనివారు, మధ్య తరగతి వారు బాలీవుడ్‌లో ఎదగలేరని, వారు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.

బాలీవుడ్‌లో నటిగా ఎదగాలనుకుంటే మీరు పార్టీలకు వెళ్లాలి. బాంద్రా లేదా జుహూలోని ఖరీదైన క్లబ్‌లకు వెళ్లాలి. అక్కడి వారిని స్నేహితులుగా చేసుకోవాలి. లేకపోతే కష్టాలు ఎదుర్కొవాల్సిందే. ఇది నటీనటుల మీద పడుతున్న అనవసరమైన ఒత్తడి. మీరు పీఆర్ మేనేజర్లకు డబ్బులు ఇస్తున్నా వారి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. వారు కూడా పార్టీలకు వెళ్లమనే సలహా ఇస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి, నాన్-ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు దుస్తులు, షూస్, కార్లు, పీఆర్, స్టయిలిస్ట్, సెలూన్ ఖర్చులు భరించలేరు. ఇవన్నీ మెయింటైన్ చేయలేక ఒక దశలో అసలు ఎందుకొచ్చాం? ఏం చేస్తున్నాం? అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అంటూ శ్రద్ధ ఓ సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేసింది.