అమ్రిన్ ఖురేషి అనే హైద‌రాబా‌ద్ అమ్మాయి బాలీవుడ్‌ లో అడ‌గుపెడుతుంది. ద‌ర్శ‌క నిర్మాత సాజిద్ ఖురేషి కుమార్తె, రాయల్‌ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత ఎమ్‌.ఐ.ఖురేషి మనవరాలు అయిన అమ్రిన్ తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘సినిమా చూపిస్త మావ‌, జులాయి రీమేక్స్‌ లో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో హీరోగా బాలీవుడ్ స్టార్ మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మ‌షి చ‌క్ర‌వ‌ర్తి హీరోగా న‌టిస్తున్నారు. సినిమా చూపిస్త మావ చిత్రం హిందీలో బ్యాడ్ బాయ్ పేరుతో రీమేక్ కానుంది. రాజ్‌ కుమార్ సంతోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని ఇన్‌ బాక్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సాజిద్‌ ఖురేషి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్ ‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అలానే జులాయి చిత్రాన్ని టోని డిసౌజ ద‌ర్శ‌కత్వంలో రీమేక్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రిలో చిత్ర షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. బాలీవుడ్ భామ‌లు తెలుగు ఆఫ‌ర్స్ కోసం క్యూ క‌డుతున్న స‌మ‌యంలో తెలుగ‌మ్మాయి అమ్రిన్ ఖురేషి బాలీవుడ్‌ లో అడుగుపెట్ట‌డం విశేషం.