బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ హోటల్ లో 17ఏళ్ల యువతి, 40ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి దగదర్తి మండలం, బోడిగుడి పాడుకు చెందిన గద్దె రామయ్య గుర్తించారు. జలదంకి మండలం, బ్రాహ్మణ కాలనీ వాసిగా యువతిని గుర్తించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి రామయ్యకు మరదలు వరుసయ్యే సమీప బంధువుగా తెలుస్తోంది. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియరాలేదు దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.