ఒక్క సినిమాతో టాలీవుడ్ హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది మృణాల్ ఠాకూర్. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ సీతారామం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ మ్యాజిక్ చేశారు. అద్భుతమైన పాత్రను తన నటనతో అత్యద్భుతంగా ఆవిష్కరించింది. సీతారామం ఆమెకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ తెచ్చిపెడుతుంది. ఆల్రెడీ నాని 30వ చిత్రానికి మృణాల్ సైన్ చేశారు. ఇటీవల మృణాల్ నటించిన హిందీ చిత్రం సెల్ఫీ విడుదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సెల్ఫీ డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. సెల్ఫీ మూవీలో ఆమెది జస్ట్ స్పెషల్ అప్పీరెన్స్ మాత్రమే. ప్రస్తుతం ఓ నాలుగు హిందీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మృణాల్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది, లవ్ సోనియా మూవీ బాలీవుడ్ లో ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో మరింత పాపులారిటీ రాబట్టారు. కెరీర్ బిగినింగ్ లో మృణాల్ అనేక అవమానాలు ఎదుర్కున్నారట. మృణాల్ ని మట్కా (మట్టి కుండ) అని ఎగతాళి చేసేవారట. సల్మాన్ ఖాన్ మూవీకి ఎంపిక చేసి తరువాత తొలగించారట. సీరియల్ యాక్ట్రెస్ అంటే చిన్న చూపు చూసేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక మృణాల్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. టూ పీస్ బికినీలో మృణాల్ టూ మచ్ స్కిన్ షో చేశారు. సమ్మర్ వెకేషన్ కి వెళ్లిన మృణాల్ చల్లని సాగర తీరంలో సేద తీరారు. సీతారామం మూవీలో నిండైన బట్టల్లో చూసిన ఆడియన్స్ ఆమె బోల్డ్ ఫోజుల్లో చూసి షాక్ అవుతున్నారు. మృణాల్ నుండి ఈ రేంజ్ స్కిన్ షో ఊహించలేదంటున్నారు. మృణాల్ హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.