బిగ్‌బాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది ఈ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. నన్ను సేవ్ చేసేందుకు వరుణ్‌ను పేడ టబ్‌లో పడుకోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. టాస్క్ మధ్యలో బిగ్‌బాస్ నాకు కాల్ చేశాడు. దాన్ని టీవీల్లో చూపించలేదు. వరుణ్ సరిగ్గా చేయడం లేదని, కాళ్లు కొంత బయటపెట్టాలని, బాడీ పూర్తిగా టబ్‌లో మునగాలని చెప్పాడు. అందుకే వరుణ్‌ను సరిగ్గా మునగాలని నేను చెప్పా. మరి వరుణ్‌ విషయలో క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్..

నా బట్టల త్యాగం విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, హిమజ బిగ్‌బాస్ షోలో తనను సేవ్ చేసేందుకు ప్రయత్నించారని అందుకే వరుణ్ పేడ టాస్క్‌ను డీటేయిల్డ్‌గా వివరించారని చెప్పింది హిమజ. ఇలా హౌస్‌లో కొందరిని స్పెషల్‌గా చూస్తున్నారని ఆరోపించింది. అలాంటప్పుడు ఇది ఫెయిర్ గేమ్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది ఈ డేరింగ్ లేడీ. అంతేకాదు షోలో ఆడియెన్స్ ఓట్లకు విలువ లేకుండా పోతోందని విమర్శించింది.

హౌస్‌మేట్స్‌తో ఆడుకోవాల్సిన బిగ్‌బాస్ ప్రజలతో ఎందుకు ఆడుకుంటున్నారని మండిపడింది. ఈ గేమ్‌లో నిజాయితీ లేకపోవడం వల్లే.. అవకాశమొచ్చినా మళ్లీ బిగ్‌బాస్‌లోకి వెళ్లబోమనని స్పష్టంచేసింది హిమజ.