బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది. క‌రోనా వ‌ల‌న ఈ షోని నిర్వ‌హిస్తారా లేదా అనే అనుమానం అందరిలో ఉండ‌గా, ఇటీవ‌ల ప్రోమో విడుద‌ల చేసి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక ప్ర‌స్తుతం షోకి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతుండగా, నాలుగో సీజ‌న్‌ని కింగ్ నాగార్జున హోస్ట్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఓ యాడ్ షూట్ నిర్వ‌హిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో యాడ్ షూటింగ్ జ‌ర‌గ‌గా, దీనికి సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ చిత్రీక‌రించారు.

అతి త్వ‌ర‌లోనే నాగ్ న‌టించిన బిగ్ బాస్ యాడ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే క‌రోనా కార‌ణంగా స్టార్ హీరోలంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమితం కాగా, నాగ్ షూటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావ‌డం హ‌ర్షనీయం. సీజ‌న్ 4 కోసం ప్రేక్ష‌కులు అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఇందులో కంటెస్టెంట్‌లుగా ఎవ‌రు పాల్గొంటారు, షో ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపై అంద‌రిలో ఉత్సుక‌త నెల‌కొంది.