గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకున్న సర్కార్. ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేసిన సాధారణ పరిపాలన శాఖ సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్ ను ప్రగతి భావన్ కు పంపింది. ఇప్పటి వరకు గ్రూప్ వన్ లో ఇంటర్వ్యూకి వంద మార్క్ లు, గ్రూప్ 2 లో ఇంటర్వ్యూ కి 75 మార్క్స్ ఉండేవి.

సమయం ఆదాతో పాటు అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకే ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. టీఎస్పీఎస్సి ద్వారా నియామకం అయ్యే పోస్ట్ ల్లో ఈ రెండింటికె ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మొదట గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా 503 పోస్ట్ ల భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ గ్రూప్ 2 పోస్ట్ లకు అనుమతి ఇవ్వలేదు. ఇంటర్వ్యూల పై క్లారిటీ వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వనుంది.