ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆడ శిశువునకు జన్మనివ్వగా, ఆమెకు గర్భం వచ్చేందుకు కారణమైన 17 సంవత్సరాల బాలుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా వడుకపాళెంలో లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇంటర్ విద్యార్థిని తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఉండటంతో ఆసుపత్రికి తరలించగా, ఆమె కడుపుతో ఉందని, ప్రసవానికి సమయం దగ్గర పడిందని వైద్యులు తేల్చారు.

అనంతరం ప్రసూతి వార్డుకు ఆమెను కరలించగా, ఆడ బిడ్డను కంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించగా, అందుకు తోటి విద్యార్థే కారణమని తేలింది. బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, వారిద్దరూ పలుమార్లు ఏకాంతంగా గడిపారని, వారి ప్రేమ గురించి తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు, అతన్ని స్కూల్ మాన్పించి, పనికి పంపిస్తున్నారని పోలీసులు తేల్చారు. తనకు గర్భం వచ్చిన విషయాన్ని బాలిక దాచి పెట్టిందని వెల్లడించారు. ఆమెకు మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించామని, బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించామని అన్నారు.