బయ్యారం మండలంలోని జగ్గు తండా గ్రామ పంచాయతీ బిసీ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: కాలనీకి చెందిన శ్రీను ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పిండితో బొమ్మ గీసి, పసుపు, కుంకుమ నిమ్మకాయలు ఉంచారు. ఇంట్లో ఉంటున్న శ్రీను కుటుంబసభ్యులు ఈ క్షుద్ర పూజలు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.