రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని చూస్తే టీఆర్ఎస్ లీడర్లకు వణుకు పుడుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు , నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు . కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని . రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నే రవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు . మండల కేంద్రంలో ఓ షాపు ప్రారంభోత్సవానికి ఆదివారం కీర్తిరెడ్డి హాజర య్యారు .

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మార నుందని , రాష్ట్రంలో తర్వాత ప్రభుత్వం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు . బీజేపీలోకి రావడానికి ఆయా పార్టీల లీడర్లు , ప్రజాప్రతినిధులు సిద్దంగా ఉన్నారని , అలాగే బీఎమ్ఎస్ లో చేరడానికి కార్మిక సంఘాల నేతలు తమను సంప్రదిస్తున్నారని వెల్లడించారు .

అందులో భాగంగానే సోమవారం గోదావరిఖనిలో ఏర్పాటు చేసే సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో టీబీజీకేఎస్ ముఖ్యనేత మల్లయ్య , భూపాలపల్లికి చెందిన వందలాది మంది కార్మికులు బీజేపీ అనుబంధ సంఘం బీఎమ్ఎస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు . కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చదువు రాంచంద్రారెడ్డి , కేతిపల్లి తిరుపతిరెడ్డి , మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి , నేతలు బండారి రవీందర్ , నర్సింగరావు , వేణుగోపాల్ రెడ్డి , శ్రీను తదితరులున్నారు .