వరంగల్: భాగ్యలక్ష్మి, భద్రకాళి టెంపుల్స్ కాదు దమ్ముంటే వరంగల్ కార్పొరేషన్ కు రండి. ప్రజలకు ఎవరు ఏమి ఇచ్చారో? ఎవరు ఏమి చేశారో తేల్చుకుందాం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ నేతలకు మంత్రి ఎర్రబెల్లి బస్తీ మే సవాల్ విసిరారు. ఆదివారం మల్లాపూర్ లోని వి ఎన్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కృతజ్ఞత సభ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ వైఖరి పై మండి పడ్డారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ ఇచ్చిన హామీలే వీ నెరవేరలేద న్నారు. పైగా, అబద్ధాలతో బీజేపీ ప్రజలను బుకాయిస్తున్నదని మంత్రి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు మాత్రమే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. మన రాష్ట్రం సీఎం కేసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి – సంక్షేమంలో అగ్రగామిగా, దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామని మంత్రి చెప్పారు. కేంద్రాన్ని మన రాష్ట్రం అడిగిన వాటిలో ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? నయా పైసా నిధులు ఇవ్వలేదు? మిషన్ భగీరథ ను అదే పనిగా అభినందిస్తున్నారు, కానీ, కానీ పైసా ఇవ్వడం లేదు. నీతి అయోగ్ చెప్పిన మీకు చెవి మీద పేను పారలేదు. అదే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల కు అడగక ముందే ఇచ్చేశారు. ఇదేం ద్వంద్వ నీతి? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.

బిజెపి తెలంగాణకు వరద సాయం ఎందుకు ఇవ్వలేదు? కేవలం అబద్ధాల మాటలతో ప్రజలను మోసం చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. బిజెపి ని నమ్మి మోసపోవద్దని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాలు కాదు, దమ్ముంటే చేసిన అభివృద్ధి మీద అధికారిక చర్చకు బీజేపీ రావాలన్నారు. తొండి, బండిలు కాదు, కేంద్ర మంత్రులు వచ్చి చర్చకు సిద్ధపడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. బిజెపి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే బీజేపీ ని ప్రజలు ఉరికిచ్చి కొడతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో TRS విజయం మంత్రి దయన్న విజయమని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. ఒంటి చేతితో విజయాన్ని తెచ్చి పెట్టారని అభినందించారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా డివిజన్ అభివృద్ధికి మంత్రి కృషి చేస్తరని ఆయన చెప్పారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎక్కడ ఉంటే, అక్కడ విజయం చేకూరుతుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. దయన్న ట్రబుల్ షూటర్ అని కొనియాడారు. దయన్న అనుభవం, తీసుకున్న దత్తత మీర్ పేట్ డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. తన విజయం, దయన్న విజయమని మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నారు. తన ఎన్నిక లాగా దయన్న తన గెలుపు కోసం పని చేశారని చెప్పారు. డివిజన్ ను దత్తత తీసుకున్న దయన్న, డివిజన్ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని కోరారు.