గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై సహ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రించి అమానుషంగా వ్యవహరించారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలను పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ‘దిశ’ పోలీసులు ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను అరెస్టు చేశారు.

ఈ ఘటనపై గుంటూరు అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ.. 2017 నుంచి ఇద్దరు విద్యార్థులు యువతి నగ్న చిత్రాలు నెట్‌లో పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. మొదట యువతి చిత్రాలు నెట్‌లో పెట్టి తాత్కాలికంగా డిలీట్‌ చేశారని తెలిపారు. ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉందని దృశ్యాలు మరో యువకుడికి చూపారని చెప్పారు. నిందితులు కౌశిక్‌, వరుణ్‌లు బాధితురాలి వీడియోలను పోర్న్‌ సైట్‌లో పెట్టారన్నారు. ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.