ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే కొందరు ఎందుకు టిక్‌టాక్ మాయలో పడతారో అర్థం కాదు. బీసీ డైరెక్టరేట్‌లో విధులు నిర్వహించాల్సిన ఉద్యోగి శ్రీనివాసరావు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు.

విధులు నిర్వహించాల్సిన సమయంలో బాధ్యతల్ని గాలికి వదిలేసి నిబంధనలకు విరుద్ధంగా టిక్‌టాక్ వీడియోలు చేయడమేంటని అంతా తప్పుపడుతున్నారు. “యూనియన్ నాయకుడ్ని నేను నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు” అనే ఓవర్ కాన్ఫిడెన్సా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన వయసేంటీ ఆ అమ్మాయిలేంటీ ఆ పాటలేంటీ ఆ డ్యూయెట్లూ, ముసిముసి నవ్వులేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. తోటి ఉద్యోగులు కరోనా విధుల్లో బిజీగా సేవలు చేస్తుంటే ఈయన గారికి టిక్‌టాక్ వీడియోలు కావాల్సి వచ్చాయా అని మండిపడుతున్నారు.

హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు ఈమధ్యే డైరెక్టరేట్‌లో ఆన్‌డ్యూటీ విధులకు వచ్చారు. ఏ రోజూ విధులకు సరిగా హాజరు కారనీ పదవుల్ని అడ్డం పెట్టుకొని విధులకు సరిగా రావట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల్ని మచ్చిక చేసుకుని పైరవీలు కూడా జోరుగా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈమధ్య ఓ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టింగ్‌లో శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయనపై చర్యలెందుకు తీసుకోవట్లేదో ఏపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది టాలెంట్ ఉన్నవాళ్లు నిరుద్యోగులుగా రోడ్లపై తిరుగుతుంటే, ఇలాంటి బాధ్యత లేని వాళ్లు ఉద్యోగాలు వెలగబెడుతూ రాష్ట్రం డెవలప్ అవ్వనివ్వకుండా అడ్డు పడుతున్నారని ఫైర్ అవుతున్నారు.