ఈ మ‌ధ్య కాలంలో బాగా హిట్ అయిన పాపుల‌ర్ సాంగ్ బుల్లెట్ బండి. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ సాంగ్‌ను ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించారు. లక్ష్మణ్‌ రచించిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఆగస్టు ఏప్రిల్‌ 7న యూట్యూబ్‌‌లో విడుదలైన ఈ ప్రైవేట్ సాంగ్ కోట్ల వ్యూస్ దక్కించుకుంది. లైక్‌లు లక్షల్లో షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. న‌వ వ‌ధువు అప్ప‌గింత‌ల‌లో బుల్లెట్ బండి పాట‌కు డ్యాన్స్ చేయగా, ఇది తెగ వైర‌ల్ అయింది. దీంతో ఈ పాట‌ని ప్ర‌తి ఒక్క‌రు ట్రై చేస్తున్నారు. ఆ మ‌ధ్య న‌ర్సు ట్రై చేయగా, ఈ డ్యాన్స్ ఆమె జాబ్‌కి ఎస‌రులా మారింది. ఇక రీసెంట్‌గా టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత కూడా ఈ జానపదానికి అదిరిపోయే స్టెప్పులేశారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు.
వధూవరులతో పాటు ఎంపీ కవిత కూడా డ్యాన్స్ చేశారు ఆ వీడియో కూడా సోషల్ మీడియాని షేక్ చేసింది.

బుల్లెట్ బండి పాట కేవలం తెలంగాణ కు మాత్రమే పరిమితం అవ్వలేదు. పక్క రాష్ట్రాల్లో సైతం ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు వధువులు. ఈ విషయంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఈ పాటకు మరో నవ వధువు స్టెప్పులెసింది. ప్రకాశంజిల్లా కోమరోలు మండలం కురాకువారి పల్లెలో పెళ్లి కూతురు బుల్లెట్‌ బండి పాటకు డ్యాన్స్‌ చేసి అందరిని ఆకట్టుకుంది. పెళ్లి కూతురు తన స్లైలో స్టెప్పులెస్తూ కేక పుట్టించింది. ఆర్మీలో పనిచేస్తున్న శ్రీకాంత్‌ను తేజశ్రీ అనే అమ్మాయి ఈనెల 27వ తేదిన పెళ్లాడింది. ఈ సందర్బంగా పెళ్ళి కూతురు తేజశ్రీ బుల్లెట్‌ బండి పాటకు పెళ్ళికొడుకు ముందు స్టెప్పులేయడంతో బంధువులు చప్పట్లతో ఎంకరేజ్‌ చేశారు… ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. న‌వ వ‌ధువు వేసిన డ్యాన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.