42 ఏళ్ల మహేష్ చంద్ బదోలా ఢిల్లీలో ఓ జ్యువెలరీ షోరూంలో ఉద్యోగి. అది చాలా పెద్ద షోరూం. అందులో రకరకాల నగలుంటాయి. రోజూ లక్షల్లో బిజినెస్ నడుస్తూ ఉంటుంది. దానికి మహేష్ చంద్ అకౌంటెంట్. అందువల్ల బిజినెస్‌లో వచ్చే డబ్బును షాపు బ్యాంక్ అకౌంట్‌లో సేవ్ చెయ్యడం, డ్రా చెయ్యడం వంటి పనులు కూడా మహేష్ చంద్ చూసుకునేవాడు. ఐతే, ఓ రోజు అతని మొబైల్‌కి చైనా నుంచి ఓ లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేశాడు. బట్టలు లేని ఓ అమ్మాయి కనిపించింది. నాలాంటి చాలా మందిని చూడాలనుకుంటే ఈ లైవ్ చాట్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అని నవ్వి మాయమైంది. పనులన్నీ పక్కనపెట్టి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. దాన్లో రకరకాల వీడియోలున్నాయి. అవన్నీ పోర్నోగ్రఫీ వీడియోలు.

రెండ్రోజులు పోర్నోగ్రఫీ వీడియోలు చూశాక ఆ యాప్ కంటెంట్ ఆపేసింది. మరిన్ని చూడాలనుకుంటే, మంత్లీ లేదా ఇయర్లీ అకౌంట్ తీసుకోండి అని చెప్పింది. నెలవారీ ఎంత చెల్లించాలి అంటే, రకరకాల ప్యాకేజీలు చెప్పింది. మీకు నచ్చిన ప్యాకేజీ తీసుకోండి. దానితి తగ్గట్టుగా కంటెంట్ ఉంటుంది అని చెప్పింది. అదిరిపోయే కంటెంట్ కావాలంటే ప్యాకేజీ కూడా ఎక్కువ రేటులో ఉంటుందని చెప్పింది. మొదట్లో చిన్న ప్యాకేజీ తీసుకున్న అతను క్రమంగా బూతుబొమ్మలు, బూతు వీడియోలకు బానిసై పెద్ద పెద్ద ప్యాకేజీలు కొనడం ప్రారంభించాడు. ఇందుకోసం షాపు బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును చెల్లించసాగాడు. 17 ఏళ్లుగా తన షాపులో పనిచేస్తున్న మహేష్ చంద్‌పై ఓనర్‌కి చాలా నమ్మకం ఉంది. అందువల్ల ఓనర్ దినేష్ కుమార్ దగ్గర చాలా చనువు ఉండేది. చాలా నిర్ణయాలు మహేష్ స్వయంగా తీసేసుకునేవాడు.

ఓనర్ ఎంతలా నమ్మాడంటే బ్యాంక్ అకౌంట్‌తోపాడూ డెబిట్ కార్డును కూడా అతనికి ఇచ్చాడు. ఆ అకౌంట్‌లో కోట్ల రూపాయల మనీ ఉంది. అయిన సరే నమ్మకంతో మహేష్‌కి కార్డు ఇచ్చాడు. నమ్మకాన్ని నట్టేట ముంచుతూ అడ్డంగా మనీని వాడేశాడు మహేష్. బ్యాంక్ అకౌంట్‌లో ఓనర్ ఫోన్ నంబర్ మార్చేసి తన నంబర్ అప్‌డేట్ చేశాడు. అందువల్ల డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినా ఓనర్‌కి మెసేజ్ వెళ్లేది కాదు. ఇలా ఓనర్‌కి తెలియకుండా ఎప్పటి నుంచో డబ్బు చెల్లిస్తుండటంతో తాజాగా విషయం తెలిసేనాటికే రూ.2 కోట్లు అవగొట్టేసినట్లు అర్థమైంది. ప్రతిసారీ మనీ బిగో (Bigo) అనే యాప్‌కి పేటీఎం ద్వారా వెళ్లసాగింది. దీనిపై 2019లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ లోని ఫైనాన్షియల్ క్రైమ్స్ యూనిట్ దీని సంగతి చూసింది. మేటర్ బయటపడ్డాక మహేష్ చంద్ పారిపోయాడు. అజ్ఞాతంలో దాక్కున్నాడు. పోలీసులు కనిపెట్టి బురారీ ఏరియాలో పట్టుకున్నారు. ఇదీ మేటర్. బూతు ప్రపంచం ప్రమాదకరమైనదనీ, దాన్లో మునిగితే సర్వనాశనం తప్పదని ఈ కేసు మనకు తెలుపుతోంది.