సూరజ్ అనే కిరాతక భర్త, తన భార్య ఉత్తరను చంపేందుకు ఒక దఫా రక్తపింజరి, మరోదఫా నాగుపాము లను వదిలాడు ఆమెను పాముకాటుతోనే చంపి కేసు పక్కదారిపట్టించేందుకు కుట్ర చేసాడు. అయితే వాడి మోసం బయటపడింది అయితే గత ఏడాది జరిగిన కేసు విచారణలో ఇప్పుడు పోలీసు, పాము కాటు సీన్ను మళ్ళీ వీడియో తీయించి, నేరాన్ని పటిష్టమైన సాక్ష్యాలతో ఎలా కోర్టు ముందు ఉంచిందో చూడండి. కేరళలోని కొల్లంలో, సూరజ్ మొదట తన భార్య బెడ్ రూమ్ లోకి రక్త పింజారి వదిలాడు దాని కాటునుంచి ఆమె బయటపడింది దీంతో కొద్దీ రోజులతరువాత, ఆమెకు మత్తుమాత్రలిచ్చి నిద్రబుచ్చి నాగుపామును, వదిలి, పాముకాటుతో చంపించాడు.

దీని సీన్ రికన్స్ట్రక్షన్ కోసం ఇప్పుడు పోలీసులు కేరళ అటవీశాఖ సాయం తీసుకున్నారు. ఇఁదుకోసం, ఒక డమ్మీ లేడీ బొమ్మను తయారుచేశారు. ఆ బొమ్మను మంచం మీద పడుకో బెట్టారు. గది తలుపులు వేసి పాముని వదిలారు చాలాసేపు పాము బొమ్మ జోలికి పోలేదు తర్వాత చికెన్ పీసులు బొమ్మచేతికి కట్టారు అప్పుడూ పాము బొమ్మ దగ్గరకి పోలేదు చివరకు బొమ్మచేతిని పాము దగ్గరకు తెచ్చి పెట్టారు అప్పుడు పాము బొమ్మ చేతిని కాటు వేసింది ఇలా వేసిన కాటు కొలతలు తీసుకున్నారు. తర్వాత దాని తల పట్టుకుని బలవంతంగా చేతిమీద కాటు వేయించారు అలా వేయించిన కాటు కొలతలు తీసుకున్నారు ఇవన్నీ కోర్టులో న్యాయవిచారణకు తిరుగులేని సాక్ష్యాలని పోలీసులు చెప్పారు.