బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడే ముఠాకు తుపాకులను రవాణా చేసే ఆరుగురు సభ్యుల ముఠాను గురువారం టాస్క్‌ఫోర్స్ మరియు దుగ్గోండి, గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి రెండు 9యం.యం. పిస్తోల్లు మరియు ఆరు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
- 1. జన్ను కోటి, తండ్రిపేరు పెద్దసమ్మయ్య, వయస్సు 32, గ్రామము చలపర్తి, దుగ్గోండి మండలం, వరంగల్ రూరల్ జిల్లా.
- 2. ముడురుకోల్ల సంతోష్, ఆలియాస్ సంతూ తండ్రి కోమురయ్య, వయస్సు 35, నివాసం మరియు మండలం నర్సంపేట్, వరంగల్ రూరల్ జిల్లా.
- 3. అబ్బర్ల రాజయ్య, తండ్రి బుచ్చయ్య, వయస్సు 46, గ్రామం మనుబోతులగడ్డ, మండలం ఖానాపూర్, వరంగల్ రూరల్ జిల్లా.
- 4. వాయినాల రవి, తండ్రి రాములు, వయస్సు 39, బండారుపల్లి గ్రామం, ములుగు జిల్లా.
- 5. మొగిలి ప్రతాప్ రెడ్డి, తండ్రి బొండరెడ్డి, వయస్సు 59, పాపయ్యపేట గ్రామం, చెన్నారావుపేట.,వరంగల్ రూరల్ జిల్లా.
- 6. నిమ్మానికొండ మల్లికార్జున్, తండ్రి లింగయ్య, వయస్సు 37, కొమ్మాల గ్రామం, గీసుగొండ మండలం, వరంగల్ రూరల్ జిల్లా.
ఈ ముఠా అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన జన్నుకోటికి న్యూ డెమోక్రసీ పార్టీకి సానుభూతిపరుడి వ్యవహరిస్తూండగా, మరో నిందితుడు వాయివాల రవి గతంలో ప్రజా ప్రతిఘటన పార్టీలో పనిచేయగా, ఈ ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించాలనే అలోచనతో వీరు ఇరువురు మరో నిందితుడు సంతోష్‌తో కల్సి ఉత్తరాది రాష్ట్రాల్లో తుపాకులను కోనుగోలు చేసి ఎక్కువ ధరకు వరంగల్ ప్రాంతంలో అమ్మేందుకు ప్రణాళికను రూపోందించుకున్నారు. ఇందులో భాగంగా గతంలో న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేసిన మరో ఇద్దరు నిందితులు అబ్బర్ల రాజయ్య, మొగిలి ప్రతాప్ రెడ్డి తుపాకీతో బెదిరించి డబ్బు వసూళ్ళ పాల్పడేందుకు అవసరమయిన తూపాకుల కోసం నిందితులు ప్రధాన నిందితుడైన జన్నుకోటితో ఒప్పండం కుదుర్చుకోవడంతో, నిందితులు కోటి, రవి, సంతోష్, మల్లికార్జునులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక 9యం.యం తూపాకీతో పాటు రెండు బుల్లెట్లను కోనుగోలు చేసారు.
నిందితులు ముగ్గురు కోనుగోలు చేసిన తూపాకీ మరియు బుల్లెట్లను రాజయ్య, ప్రతాప్ రెడ్డిలకు అందజేసేందుకుగాను ఈరోజు ఉదయం దుగ్గొండి మండలం గిర్నిబాయి ప్రాంతంలోని టేకు ప్లాంటేషన్‌కు వచ్చినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌పోర్స్ ఎ.సి.పి చక్రవర్తికి సమాచారం రావడంతో ఎ.సి.పి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రమేష్ కుమార్, ఇన్స్‌స్పెక్టర్ డేవిడ్ రాజు, దుగ్గోండి సబ్-ఇన్స్‌స్పెక్టర్ సాంబమూర్తి తమ సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకోని వారి నుండి ఒక పిస్తోల్ మరియు రెండు రౌండ్లను స్వాధీనం చేసుకోగా, నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మరో నిందితుడు మల్లికార్జున్ అరెస్టు చేసిన ఇతడి నుండి ఒక తుపాకి నాలుగు రౌండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, పూర్తి సమాచారానికై దర్యాప్తు కోనసాగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఆరుగురు నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డి.సి.పి నాగరాజు, టాస్క్‌ఫోర్స్ ఎ.సి.పి చక్రవర్తి, నర్సంపేట ఎ.సి.పి సునీతా మోహన్, ఇన్స్‌స్పెక్టర్ రమేష్‌కుమార్, నర్సంపేట రూరల్ ఇన్స్‌స్పెక్టర్ సతీష్‌బాబు, గీసుగొండ ఇన్స్‌స్పెక్టర్ సంజీవ్ రావు,డేవిడ్‌రాజు దుగ్గోండి సబ్-ఇన్స్‌స్పెక్టర్ సాంబమూర్తి, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, శ్రీను,ఆలీ, శ్రీను, దుగ్గోండి హెడ్‌కానిస్టేబుల్ జంపయ్య, సుధాకర్ల, చంద్రశేఖర్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినంధించారు.