నడిరోడ్డుపై ఓ భర్త తన భార్యను నరికి చంపాడు. సత్యానారాయణపురం సమీపంలోని శ్రీనగర్‌ కాలనీలో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. 4ఏళ్ల క్రితం ప్రదీప్‌, మణిక్రాంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రదీప్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండగా మణిక్రాంతి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది. విడాకుల కేసు కూడా చివరిదశకు చేరుకుంది. భర్తతో విడిపోయిన మణిక్రాంతి తల్లి దగ్గర ఉంటోంది. గతంలో ప్రదీప్‌పై మణికాంత్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బెయిల్‌పై ప్రదీప్‌ నిన్ననే బయటకు వచ్చాడు. ఇదే సమయంలో తన భార్యను ప్రదీప్‌ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. తల్లి ముందే కూతురి తల నరికిన ప్రదీప్‌ తలని పట్టుకెళ్లి దగ్గర్లోని కాల్వలో పడేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురి మృతదేహంతో మణిక్రాంతి తల్లి ఆందోళనకు దిగారు. పోలీసులతో మణిక్రాంతి కుటుంబసభ్యుల తీవ్రవాగ్వాదానికి దిగారు. తన కూతురి చావుకు పోలీసులే కారణమంటూ తల్లి ఆందోళన చేస్తోంది.