వరంగల్ టౌన్: అర్బన్ జిల్లా పరిధిలోని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయం ముందు బైక్ పై నుండి వెళ్తూ కింద పడిపోయిన యువకుడిపై నుండి ఆర్ టి సి బస్ వెళ్లడంతో అక్కడిక్కడే మరణించాడు. మృతి చెందిన యువకుడు పల్లరుగుడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

వరంగల్ అర్బన్ నగరం లోని రోడ్లే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చర్చించుకుంటున్నారు. రోడ్డు పై గుంతలు పడడంతో గత రాత్రి కురిసిన వర్షానికి ఆ గుంతలో నీరు నిలువడంతో బండి నడిపే యువకుడు మాములు రోడ్డే కధ అని కాలు కిందపెట్టే క్రమంలో జారి పడిపోయాడు దింతో ఏటూరునాగారం నుండి హన్మకొండ కు వస్తున్న బస్ కింద పడడంతో బీటెక్ పూర్తి చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్న పల్లార్ గూడ కు చెందిన శ్రీనివాస్ అనే నిరుద్యోగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మృతికి కారణం ఎవ్వరు.