హైదరాబాద్: నగరంలోని బోరబండలో గురువారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. బోరబండలోని కుంట గుడిసె వద్ద ఓ ప్లాస్టిక్ కవర్‌లో నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలివెళ్లారు. దీన్ని గమనించిన స్థానికులు ప్లాస్టిక్‌ కవర్‌ను తెరిచి చూడగా అందులో నవజాత శిశువు అర్ధ భాగం మాత్రమే కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…