భూతగాదా విషయంలో కిడ్నాప్ పాల్పడినట్లుగా ఖచ్చితమైన ఆధారాలతోనే జంగా రాఘవరెడ్డిని అరెస్టు చేసినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రకటించారు. జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుని కుట్రపూరితంగా పోలీసులు అరెస్టు చేసినట్లుగా కాంగ్రెస్ రాష్ట్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తుండంతో దీనిపై వరంగల్ పోలీసు కమిషనర్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. జంగా రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంలో ఎలాంటి ఒత్తిళ్ళు లేవని ఇది కేవలం ఓ ఫిర్యాది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి అరెస్టు చేయడం మాత్రమే, నిందితుడు జంగా రాఘవరెడ్డి ఫిర్యాదిని బెదిరించి కొట్టి అతనిని కిడ్నాప్ చేయడం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటంతోనే అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, నిందితుడు రాఘరెడ్డి నిజంగా ఎలాంటి నేరానికి పాల్పడనప్పుడు అతనే స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి సంజాయిషీ ఇవాల్సింది.

కాని అతడు అలా చేయకుండా తాను నేరానికి పాల్పడినట్లు తన అంతరాత్మకు తెలుసుకాబట్టి తన పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయిన మరుక్షణమే రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అయిన పోలీసులు అరెస్టు చేసింది వరంగల్ కమిషనరేట్ పరిధిలో భూకజ్జాలకు పాల్పడుతూ, తన మాటవినని వారిపై తన అనుచరులతో దాడులకు పాల్పడంతో పాటు, అవసరమనుకుంటే కిడ్నాపులకు పాల్పడి భాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం తన వృత్తిగా ఎన్నుకున్న ఓ రౌడీ షీటర్‌ను ఘన చరిత్ర కలిగిన వున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందితుడు వకాల్తా పుచ్చుకోవడం సరికాదని. ఇతని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుకు పైగా కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో నమోదయి వున్నాయని కాంగ్రెస్ నాయకులు గుర్తించాల్సి వుందని. ముఖ్యంగా వరంగల్ పోలీసులు ప్రజల పక్షాన పనిచేస్తూందని. ఎవరైతే ప్రజల ఆస్తులకు నష్టం కలిగించి, వారి హక్కులను భంగం కలిగించిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకుంటుందని. మీ స్వార్ధం, ఓ నేరస్తుడి విడుదల కోసం కాంగ్రెస్ నాయకులు పోలీసులపై అసత్య ప్రచారం సరికాదని ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తమ ఆలోచన విధానంలో మార్చుకుంటారని కోరుకుంటున్నానని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.