తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 1213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొత్తం 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1,213 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 4143 కేసులు నెగెటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 18570కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 275కి పెరిగింది. అలాగే, ఈ ఒక్క రోజే 987 మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,069కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,226 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే ఈ రోజు 998 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48, సంగారెడ్డిలో 7, కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 7, ఖమ్మంలో 18, గద్వాలలో 1, సూర్యాపేటలో 4, కామారెడ్డిలో 2, నల్గొండలో 8, సిద్దిపేటలో 1, ములుగులో 4, వరంగల్ రూరల్‌లో 10, జగిత్యాలలో 4, మహబూబాబాద్‌లో 5, నిర్మల్‌లో 4, మెదక్‌లో 1, యాదాద్రిలో 1, నిజామాబాద్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 9, భద్రాద్రి కొత్తగూడెంలో 7, నారాయణపేట్‌లో 2, నాగర్ కర్నూల్‌లో 1, రాజన్న సిరిసిల్లలో 6, వికారాబాద్‌లో ఒక్క కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.