తమిళ హీరో ప్రశాంత్, సిమ్రాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన జోడీ సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ పాత్రలో నటించి సినిమా రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది త్రిష. అటు సీనియర్ హీరోలతోనూ, ఇటు యంగ్ హీరోలతోనూ నటించిన త్రిషకు గత రెండేళ్ల నుంచి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. తమిళంలో త్రిషకు ఆఫర్లు వస్తున్నా తెలుగులో మాత్రం దర్శకనిర్మాతలు త్రిషను పట్టించుకోవడం మానేశారు. త్రిష 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే నటించడం వల్ల లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్లు రావడం లేదు. అయితే రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హథీ మేరే సాథీ సినిమాలో త్రిష అతిథి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది.హథీ మేరే సాథీ మూవీ మేకర్లు త్రిష కోసమే ప్రత్యేకంగా ఆ పాత్రను డిజైన్ చేశారని సమాచారం.

ఈ పాత్రలో త్రిష బ్లౌజ్ లేకుండా చీరకట్టుతో కనిపించనుందని తెలుస్తోంది. గతంలో త్రిష ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేయలేదు. అయితే మూవీ మేకర్స్ ఈ పాత్రలో నటించడానికి 70 లక్షల రూపాయల పారితోషికం త్రిషకు ఆఫర్ చేశారని సినిమాలో 25 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో త్రిష నటించబోతుందని తెలుస్తోంది. తెలుగులో అరణ్య పేరుతో ఈ సినిమా విడుదల కాబోతుంది. రానా ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపిస్తున్నారు.ఈ సినిమాలో రానా అడవిని నమ్ముకొని ఉన్న ఆదివాసీ ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష పాత్ర గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. చాలా నెలల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతుండటం గమనార్హం.