నగర ప్రజలకు స్వచ్చమైన వాతావరణం అందించుటకు భద్రకాళీ బండ్ ఎంతగానో దోహదపడుతున్న నేపథ్యంలో ఆ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బలియా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగర పాలక సంస్థ అధికారులతో కలిసి భద్రకాళీ బండ్ పనులనున తనిఖీ చేశారు .

నిర్దేశించిన వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధి కారులకు ఆదేశించారు . పనుల వేగంతో పాటు పూర్తి నాణ్యతతో పనులను చేపట్టి పనులు జరుగుతున్న సందర్భంలో ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు . భద్రకాళీ బండ్ అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని అన్నా రు .

భద్రకాళీ బండ్ లో అసౌకర్యాలు తావివ్వకుండా అందరికీ అన్ని వసతులను కల్పించాలని అధికారులకు చెప్పారు . అవసరమైన చోట ర్యాంపులు , ఇతర పనులు నిర్మాణం చేపట్టాలని తెలిపారు . అధికారులు టీం వర్కర్ గా పని చేసి అందు బాటులోకి తేవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు . ఈ పర్యటనలో కుడా టౌన్ పార్లింగ్ అధికారి అజిత్ రెడ్డి స్మార్ట్ సిటీ ఎస్సీ భాస్కర్ రెడ్డి , ఈఈ భీమ్ రావు , మున్సి పాలిటి ఈఈ లక్ష్మారెడ్డి , కుడా ఇంజనీరింగ్ అధికారులు , వెంకటేశ్వర్లు , సిద్ధార్థ నాయక్ , రవీందర్ , ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు .