చర్ల పోలీసులు మరియు CRPF 141 బెటాలియన్ పోలీసులు చర్ల మండలం కొరకట్ పాడు గ్రామ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.అట్టి వారిని విచారించగా వారి పేర్లు 1.వండో జోగా S/o. భీమా, 2.రవ్వ ఉంగల్ S/o. మూడ r/o డొకుపాడు గ్రామం, కిస్తారం పి‌ఎస్, సుక్మా జిల్లా ఛత్తీస్గడ్ రాష్ట్రం అని చెప్పారు. వీరు గత 5 సంవత్సరాల నుండి నిమ్మలగూడెం RPCలో మిలిసియా సభ్యులుగా పనిచేస్తున్నారు.

వీరు ఆరు రోజుల క్రితం రజిత, చర్ల LOS కమాండర్ మరియు ఇతర దళ సభ్యులతో కలిసి కుర్ణపల్లి-బోదనెల్లి అటవీ ప్రాంతంలో పోలీసులను హతమార్చడానికి మందుపాతరలను అమర్చడానికి వస్తుండగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసువారిని చూసి పారిపోయారు. ఈ రోజు ఇద్దరు మిలిషియా సభ్యులు వండో జోగా, రవ్వ ఉంగల్ లు కొరకట్ పాడు గ్రామానికి సమీపాన అటవీ ప్రాంతంలో కూంబింగ్ కూంబింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీసు వారికి పట్టుపడినారు. పట్టుబడిన మిలిషియా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది.