భద్రాచలం: వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భేరీ పూజను నేత్రపర్వంగా జరిపారు. మేళతాళాలు, వేదమంత్రాల నడుమ గరుడపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఈ వేడుకల్లో భాగంగా శనివారం సాయం త్రం భద్రాద్రి రామయ్యకు ఎదుర్కోలు, ఆదివారం నవమిరోజు మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం, 11న మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు.