బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాలను కొత్తరకం వైరస్ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ కొత్తరకం వైరస్ కారణంగా బ్రిటన్ లో ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించారు. పైగా క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉండటంతో బ్రిటన్ ప్రభుత్వం ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ తో పాటుగా అటు దక్షిణాఫ్రికా దేశంలోనూ కొత్త స్టెయిన్ కు సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్ లో కొత్త స్టెయిన్ వేగంగా విస్తరిస్తుండటంతో బ్రిటన్ చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ఉధృతి తగ్గలేదు. ఈ సమయంలో కొత్త స్టెయిన్ వ్యాపిస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. ఈ దిశగా ఇప్పుడు ఆయా దేశాలు ఆలోచనలు చేస్తున్నాయి.