భర్తతో చక్కగా కాపురం చేయాల్సిన ఓ వివాహిత దారి తప్పింది. పక్కింటి కుర్రాడితో అఫైర్ పెట్టుకున్నది. భర్తకు నైట్ డ్యూటీ కావడంతో తరచూ వీళ్లిద్దరూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఓ రోజు పక్కింటి కుర్రాడితో మాంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు భర్త ఆఫీసు నుంచి సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సదరు కుర్రాడు ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ ఈ సన్నివేశాన్ని అదే కాలనీలో ఉండే ఇద్దరు ఆకతాయిలు చూశారు. ఆ తర్వాత అసలు రచ్చ మొదలైంది. వాళ్లు కూడా సదరు వివాహితను ఏడిపించడం మొదలుపెట్టారు. తమతో గడపకపోతే భర్తకు అసలు విషయం చెబుతామంటూ బెదిరించారు. చివరకు చాలా ట్విస్టులు జరిగాయి. ఫైనల్ గా ఆ వివాహిత ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని సెల్లూర్ గ్రామానికి చెందిన విమల్ రాజ్ (30) కొటై గ్రామానికి చెందిన రేష్మా (23)కు నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. ఇదిలా ఉంటే ఈ దంపతులకు ఓ కుమార్తె (3) కూడా జన్మించింది.

కానీ అనుకోకుండా ఈ దంపతుల పక్కింట్లోకి ఓ కుర్రాడు దిగాడు. రేష్మా అందాన్ని చూసి మైమరిచిపోయిన కుర్రాడు. ఆమెకు దగ్గరయ్యాడు. విమల్ కు నైట్ డ్యూటీ కావడంతో రోజు రాత్రి అతడు వెళ్లిపోయేవాడు. అదే టైంలో అదను చూసి ఆ కుర్రాడు ఎంట్రీ ఇచ్చేవాడు. చిన్నగా పరిచయం పెంచుకున్నాడు. రేష్మకూడా అతడి ట్రాప్ లో పడిపోయింది. చివరకు వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు.
ప్రతిరోజు భర్త ఇంట్లోనుంచి వెళ్లపోగానే రేష్మ ఆ యువకుడితో గడిపేది. ఇదిలా ఉంటే ఓ రోజు సడెన్ గా విమల్ రాజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు.
దీంతో ఆ కుర్రాడు గొడ దూకి పారిపోయాడు. రేష్మా కూడా ఊపిరిపీల్చుకుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రియుడు గొడ దూకే సమయంలో పక్కింట్లో ఉంటున్న బాలమురుగన్ ముత్తుకుమార్ అనే ఇద్దరు యువకులు చూశారు.
తర్వాత రేష్మను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తమ కోరిక తీర్చకపోతే నీ భర్తకు అసలు విషయం చెబుతామంటూ ఆమెను బెదిరించసాగారు. అయినా రేష్మ ఒప్పుకోలేదు. దీంతో సదరు యువకులు ఓ రోజు విమల్ రాజ్ను తీసుకొని బయటకు వెళ్లారు. అతడికి మద్యం తాగించారు. మొత్తం విషయం చెప్పారు.
అప్పటి నుంచి విమల్ రాజ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం పట్ల ఆమెను టార్చర్ పెట్టేవాడు. దీంతో భర్త టార్చర్ భరించలేక రేష్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.తన చావుకు కారణం.. బాలమురుగన్ ముత్తుకుమార్ కారణం అని డెత్ నోట్ రాసిపెట్టి రేష్మా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.