ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనంగా మారింది.

వివరాలు: తిరుచ్చి జిల్లా తురైయూర్‌ పులివలానికి చెందిన సంతోష్‌(25), లక్ష్మి(27) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సంతోష్‌ నాలుగునెలల క్రితం పనివెదుక్కుంటూ చెన్నైకు వెళ్లాడు. అప్పటి నుంచి భార్య లక్ష్మికి భర్త సమాచారం తెలియలేదు. దీంతో భర్త అదృశ్యమైనట్లు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్‌ రామర్‌(43) ఆమెపై కన్నేశాడు.

తరచూ విచారణ పేరుతో లక్ష్మి ఇంటికి రాకపోకలు సాగించి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గుర్తించిన ఇరుగుపొరుగు వారు శనివారం అర్ధరాత్రి లక్ష్మి ఇంట్లో రామర్‌ ఉండగా బయట తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ ముత్తుసామి తలుపులు తెరిపించి కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకని విచారణ చేస్తున్నారు.