పెళ్ళికిముందు తనభార్య ప్రేమ కధతెలిసిన ఓ భర్త ఆమెకు అతడితో వివాహానికి ఒప్పుకున్నాడు ఏడేళ్ల సంసారం, ఇద్దరు బిడ్డల తరువాత భార్యను పెళ్ళికి ముందు ప్రేమించిన వ్యక్తి తన భార్య దక్కలేదని పెళ్లికూడా చేసుకోలేదని తెలుసుకొని, భార్య కూడా తాను ప్రియుడి దగ్గరకే వెళ్తానని చెప్పడంతో ఓకే అన్నాడు.

భోపాల్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మహేష్‌తో ఫ్యాషన్‌ డిజైనర్‌ సంగీతకి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లికి ముందు సంగీత ఒక వ్యక్తిని ప్రేమించింది. వారి ప్రేమకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. అందుకే సంగీతను వెంటనే మహేష్‌కిచ్చి పెళ్లి చేశాడు.ఆమె ప్రేమించిన వ్యక్తి ఆమె మీద ఉన్న ప్రేమతో ఇప్పటికీ ఎవరినీ వివాహం చేసుకోలేదని తెలిసిన సంగీత తన భర్తకు విడాకులిచ్చి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.

దీనికి మొదట మహేశ్‌ అంగీకరించకపోయినా తన భార్య సంతోషం కోసం ఒప్పుకున్నాడు. అయితే ఇద్దరు పిల్లల సంరక్షణను తనే చూసుకుంటానని చెప్పాడు. దీనికి భార్య సంగీత కూడా అంగీకరించింది. అంతేకాకుండా సంగీతకు ఎప్పుడు పిల్లల్ని చూడాలని అనిపించినా వెంటనే ఇంటికి వచ్చి చూడొచ్చని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. అయితే ఇరువురి అంగీకారం ఉ‍న్నందున కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తుందని వారి తరపు కౌన్సిలర్ తెలిపారు…