మల్కాజిగిరి: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం: గౌతంనగర్‌కు చెందిన గడ్డం మహేందర్, అనూష(24) ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడడాన్ని గమనించి అనూషను మహేందర్ ప్రశ్నిస్తేసోదరితో మాట్లాడుతున్నానని చెప్పింది. గత నెల 30వ తేదీ ఉదయం ఇంటి నుంచి టైలరింగ్ దుకాణానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అనూష ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.