పుర్నియా జిల్లా చకర్పద గ్రామానికి చెందిన వ్యక్తికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, వీరి ఇంటి పక్కన ఉండే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేనప్పుడు అతడు ఇంటికి వచ్చి ఆమెతో రొమాన్స్ చేసేవాడు. ఇలా కొద్దిరోజుల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల కూడా రోజూ లాగే పని కోసం భర్త బయటకు వెళ్లాడు. వెంటనే ప్రియుడు ఇంటికి వచ్చాడు. వీళ్లిద్దరు బెడ్ రూంలో రొమాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బయట పనులు ముగించుకుని త్వరగా ఇంటికి భర్త వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి షాకయ్యాడు.

బెడ్ రూంలో తన భార్య అతడితో రొమాన్స్ చేస్తూ కనిపించే సరికి ఆగ్రహంతో భార్యను, ప్రియుడిని నిలదీశాడు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం ఎక్కడ బయట పడుతదోనని భార్య, ఆమె ప్రియుడు భర్త మెడకు తాడు బిగించి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానమొచ్చి భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.