బాధితుడు జరీష్ అతని భార్య ఫిరోజతో గత 12 సంవత్సరాలుగా పట్టణంలో నివాసముంటున్నాడు. ఈ సమయంలో జరీష్ స్నేహితుడు అఖిల్ ప్రతీ రోజు వారి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే జరీష్ భార్య ఫిరోజాపై అతడు కన్నేశాడు. అందుకు తగ్గట్టుగానే ఫిరోజా సైతం అఖిల్‌తో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. అయితే ఒక రోజు జరీష్ ఇంట్లో లేని వేళలో, అఖిల్ వారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఫిరోజా సైతం ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన జరీష్ తన మాటలతో ఫిరోజాను మాయ చేశాడు. ఫిరోజా అతనికి లొంగిపోగా, ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.
అలా ఇద్దరూ కలిసి తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు.

ఈ క్రమంలో తరచూ జరీష్ వీరిద్దరి ప్రవర్తనను అనుమానించాడు. చుట్టుపక్కల వారు చెప్పిన సైతం జరీష్‌కు ఫిర్యాదు చేయడంతో, అతడు తన భార్యను మందలించాడు. అయితే అఖిల్ పొందు కోరిన ఫిరోజా తన భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని చూసింది. అందుకోసం అఖిల్‌తో కలిసి జరీష్ అడ్డుతొలగించాలని ఫిరోజా ప్లాన్ చేసింది. ఇందుకోసం రాత్రి వేళ సిలిండర్ లీక్ చేసి పేల్చి భర్తను చంపేయాలని ప్లాన్ చేశారు. అర్థరాత్రి దొంగతనంగా ఇంట్లోకి ప్రవేశించిన, అఖిల్ వంట ఇంట్లో గ్యాస్ లీక్ చేయగా, ఫిరోజా నెమ్మదిగా ఇంటి తలుపులు వేసి బయటపడింది. అఖిల్, ఫిరోజా ఇంటి నుంచి పరారు కాగా, సిలిండర్ పేలడంతో ఇల్లు పేలిపోయి జరీష్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, జరీష్ ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు జరీష్ వాంగ్మూలం మేరకు అఖిల్, భార్య ఫిరోజాపై కేసు నమోదు చేయగా, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.