వీడెవడో తమాషా దొంగ ! రాత్రిళ్ళు కష్టపడి ఇళ్లలోకి జొరబడతాడు, ఇంతకీ వాడు చేసే చోరీలు, ఆడవాళ్ళ చెప్పులు, లంగాలు , అండర్ వేర్లు , బ్రాలు…

చెన్నైలోని కోవై తుడియలూరు మీనాక్షి గార్డెన్‌ ప్రాంతంలో కొద్ది రోజులుగా ఇక్కడ ఉతికి ఆరేసిన మహిళల లోదుస్తులు, వారి పాదరక్షలు, కారులో ఉండే మహిళల కాస్మెటిక్స్‌ అదృశ్యమవుతున్నాయి. వరుస ఘటనలతో ఆందోళన చెందిన స్థానికులు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కాళ్లకు పట్టీలు ధరించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అతను చోరీ చేసి తీసుకెళ్లిన దుస్తులను అదే ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద దాచాడని, వాటిలో కొన్నింటిని అక్కడే నిప్పంటించి దహనం చేశాడని తెలిసింది. ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.