కర్ణాటకలోని మంగళూరులో సెక్యూరిటీ గార్డుకు లాటరీలో రూ.కోటి వరించింది. వారానికి ఐదుగురికి రూ.కోటి చొప్పున బహుమతి మొత్తం లభించే కేరళ భాగ్యమిత్ర లాటరీ అతనికి తగిలింది. మంగళూరులో ఓ భవనం వద్ద సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మోయిద్దీన్‌ కుట్టి స్వస్థలం కేరళ. కుటుంబంతో కలిసి ఉపాధి కోసం ఏళ్ల కిందట వచ్చాడు. అతనికి రోజూ లాటరీ టికెట్‌ కొనే అలవాటు ఉంది. ఏప్రిల్‌ 4న రూ.100కు కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ కొన్నాడు. అదృష్టం వరించి ఐదు మందికి రూ.కోటి చొప్పున లాటరీ తగిలింది. అందులో మోయిద్దీన్‌ ఒకరు. డబ్బులు చేతికి రాగానే భార్య, పిల్లలతో కలిసి కేరళకు వెళ్లిపోయి హాయిగా జీవిస్తానని చెప్పాడు.