82వేలకు చేరువైన మొత్తం కేసులు..

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో పాటు, వైరస్‌ సోకి 100 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం భారత్‌లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. అటు కేరళలోనూ కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ తాజాగా మరో 26 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడం, వలస కూలీల తరలింపు, విదేశాల నుంచి స్వదేశానికి ప్రయాణికులను తరలించడం మూలంగానే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.