గుజరాత్ లోని వెజల పూర్ ప్రాంతంలో భార్యకు భర్త ముద్దు పెట్టి అనంతరం ఆమె నాలుకను కత్తితో కట్ చేశాడు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: 36 సంవత్సరాల వయసు ఉన్న మహిళ 2004లో దరియపూర్ లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఐదు సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది . 2018లో సదరు మహిళ జోహాపూర్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది .

తనకు ఎవరు లేరని సదరు వ్యక్తి ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు . అప్పటికే ఆ వ్యక్తికి మొదటి భార్య , కుమారుడు ఉన్నాడు . ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటే జాబ్ లేదా బిజినెస్ చేయాలని సూచించింది . కోపంతో ఆమెపై అతడు చేయి చేసుకున్నాడు . బుధవారం రాత్రి నవ్వుకుంటూ పడక గదిలోకి వచ్చి భార్యతో మాట్లాడాడు . ఆమె నాలుకపై ముద్దు పెట్టి అనంతరం నాలుకను పంటితో గట్టిగా అదిమి పట్టుకొని కత్తితో కోశాడు .

సగం నాలుగు బయటకు రావడంతో లబోదిబోమంటూ ఏడ్చింది . అక్కడి నుంచి భర్త పారిపోయాడు . స్థానికులు ఆమెను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆస్పత్రికి తరలించారు . వైద్యులు ఆమె నాలుకను అతికించి పోలీసులకు సమాచారం ఇచ్చారు . పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు .