తన భార్యతో బెడ్ రూమ్ లో శృంగారాన్నిరహస్యంగా వీడియో తీస్తాడు అడిగిన వాళ్లకు ఆన్ లైన్ లో డబ్బులేస్తే లైవ్ లో పెడతాడు పాపం అమాయక భార్యకు ఇదేమీ తెలియదు. బాత్ రూమ్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టి స్నానం చేసే సమయంలో వీడియో తీసి అప్ లోడ్ చేస్తాడు. ఇవన్నీ చాలవన్నట్టు, ఇటీవల భార్యను తార్చే ప్రయత్నంలో ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. బెదిరించేందుకు ఆమెతో కలిసిఉన్న వీడియోలు చూపించాడు తల గోడకేసికొట్టుకొని చనిపోతానని బెదిరించేవాడు చివరకు, చిత్రహింసలు భరించలేని స్థితికి రావడంతో ఆమె నేరుగా గుంటూరు ఎస్పీని కలిసింది ఇలా ఈ దారుణంలో ఎన్నో కొత్త కోణాలు వెలుగులోకివచ్చాయి. వీడిని గుంటూరుపోలీసులు అరెస్ట్ చేశారు.

ఏకాంతంగా గడిపిన వీడియోలను కొత్తగా వచ్చిన యాప్‌ల ద్వారా లైవ్‌గా పెట్టి భర్త తన బ్యాంకు ఖాతాకు నగదు జమచేయించుకునే వాడని తెలిసింది. అలా యూట్యూబ్‌, యాప్‌లలో లైవ్‌ల ద్వారా సంప్రదించిన వారి వద్దకు ఆమెను పంపించి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే నికృష్టపు ఆలోచన చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా తన భార్యను పరాయి పురుషుల వద్దకు వెళితే డబ్బులు వస్తాయని, అందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడని గుర్తించారు. అతను పెట్టే మానసిక క్షోభను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని సైబర్‌ నిపుణులను రంగంలోకి దించారు. ఆ యువతి పరువు కాపాడేందుకు ఇప్పటివరకు భర్త అంతర్జాలంలో పెట్టిన ఫొటోలు, వీడియోలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.