తన భార్యపై అత్యాచారం చేశాడని కానిస్టేబుల్‌పై సహోద్యోగి ఫిర్యాదు చేసిన సంఘటన బిహార్‌లోని పాట్నాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా అది అత్యాచారం కాదని వివాహేతర సంబంధం అని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: రాజీవ్ కుమార్ అనే కానిస్టేబుల్ సహార్షా జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు రైడింగ్‌కు వెళ్లినప్పుడు ఒకే రూమ్‌లో రాజీవ్ కుమార్ మరో మహిళతో కలిసి ఉన్నాడు. దీంతో రాజీవ్ కుమార్ తన భార్యను అత్యాచారం చేశాడని మరో కానిస్టేబుల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా అది వివాహేతర సంబంధమని తేల్చారు.