తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉండడంతో

భార్య తలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని అలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు : ఎట్మాదుదౌలా ప్రాంతంలో నరేష్ కుమార్ అనే వ్యక్తి టివి మెకానిక్ గా పని చేసేవాడు. 17 సంవత్సరాల క్రితం శాంతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక బాబు ఉన్నాడు. నరేష్ రోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపెట్టుకునేవాడు. ఆదివారం సాయంత్రం ఫుల్ గా మద్యం సేవించి వచ్చిన భర్తతో భార్య గొడవకు దిగింది. దీంతో భార్యను పట్టుకొని కత్తితో గొంతు కోశాడు. అనంతరం దేహం నుంచి తలను వేరు చేశాడు.

అనంతరం మొండాన్ని అక్కడి ఉంచి తల ఒక బాక్స్ లో పెట్టుకొని పారిపోయాడు . సోమవారం ఉదయం పిల్లలు నిద్ర నుంచి లేచి తన తల్లి ఉన్న రూమ్ కు వెళ్లారు . తల లేని మొండం కనిపించడంతో అరుపులు కేకలు పెట్టారు . నిందితుడు భార్య తలతో హరి పర్బత్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని నిజాలు ఒప్పుకున్నాడు . తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉండడంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు . పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు .