జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. అన్ని సమయాల్లో అండగా ఉంటానన్నాడు. అగ్నిసాక్షిగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చెప్పినట్టుగానే ఏడాది పాటు భార్యను బాగా చూసుకున్నాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆ భర్త నిజస్వరూపం బయట పడింది. రాక్షసుడిలా మారాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. భార్య నగ్న చిత్రాలను స్నేహితులకు పంపి పైశాచిక ఆనందం పొందాడు. అంతేనా, వారి లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు.

భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య:


భర్త నీచమైన మనస్తత్వం, వేధింపులను భరించలేకపోయిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త దారుణాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేసి జైల్లో వేశారు.

స్నేహితుల కోరిక తీర్చాలని టార్చర్:

రాజస్తాన్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అతడి పేరు రాజు. ఆమె పేరు అనిత. ఏడాది కిందట వివాహమైంది. కొద్దికాలం బాగానే చూసుకున్న భర్త క్రమంగా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. భార్య నూడ్ ఫొటోలను ఫ్రెండ్స్ కి పంపడం వారి కోరికలు తీర్చాలని వేధించడం. కొన్నాళ్లు భర్త వేధింపులను భార్య భరించింది. భర్తలో మార్పు వస్తుందేమో అని ఆశించింది. కానీ లాభం లేకపోయింది. రోజురోజుకి అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కుమిలిపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే భర్త దురాగతాలను పేపర్‌పై పెట్టి ప్రాణాలు తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నీచుడిని అరెస్ట్ చేశారు. పెళ్లయిన ఏడాదికే కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.